Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట నాలుగు నెలల క్రితం జరిగిన హత్యను చేధించారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం పోలోజు రమేష్(38) అనే వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు జమ్మికుంట మండలం మడిపల్లి-ఉప్పల్ రైల్వే ట్రాక్ పై గుర్తించారు. దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి కవిత రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారణ నిమిత్తం రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులకు బదిలీ చేశారు. కేసు విచారణలో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి సెల్ ఫోన్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంబించారు. అక్రమ సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరుణంలో హత్యకు పాల్పడిన కంచం రజిత, భర్త రమేష్, కంచం ఓదెలు, రుద్రవేన దేవేందర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.