Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లిమండపంలోనే వధూవరులపై ఓ దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరో 10 మంది కూడా గాయపడ్డారు. భాన్పుర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఛోటే అమబల్ గ్రామంలో బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో వివాహం జరుగుతుండగా కరెంటు పోయింది. అదే అదనుగా భావించిన దుండగుడు.. వధూవరులపై యాసిడ్ పోశాడు. దాంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది బంధువులపైనా యాసిడ్ పడి గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.