Delhi: A woman has been injured in an incident of firing at Saket court. Four rounds were fired. Police on the spot.
— ANI (@ANI) April 21, 2023
(Warning: Disturbing visuals)
Visuals confirmed by police. pic.twitter.com/vdaUBqZxmp
Authorization

నవతెలంగాణ - ఢిల్లీ: సాకేత్ కోర్టు ప్రాంగణంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటన జరగగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం బాధితురాలికి చికిత్స జరుగుతోంది. పోలీసులు ప్రస్తుతం సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు హిస్టరీ-షీటర్ అని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన కారణాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఆర్థికలావాదేవీలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. లాయర్ వేషంలో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.