Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) కన్నుమూసింది. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా ఇస్మాయిల్ కొచ్చిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. ఫాతిమా ఇస్మాయిల్ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు మమ్ముట్టి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.