Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కెనడా
టొరొంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ చోరీ జరిగింది. కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులతో నిండిన కార్గో కంటైనర్ను దుండగులు అపహరించారు. ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
టొరంటో ఎయిర్పోర్టులో ఓ విమానం నుంచి దాదాపు ఆరు చదరపు అడుగులున్న ఓ కంటైనర్ను సోమవారం కిందకు దించారు. దానిలో సుమారు 20 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ కంటైనర్ను సురక్షిత ప్రాంతానికి తరలించే తరుణంలో అదృశ్యం కావడం గమనార్హం. ఈ చోరీ వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. అయితే ఈ కంటైనర్ ఎక్కడ నుంచి వచ్చిందో, ఎవరు రవాణా చేశారో వంటి వివరాలేవీ తెలుపలేదు.