Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జమ్మూ: జమ్మూకశ్మర్‌లో పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రేనేడ్ దాడి చేసిన ఘటనలో అయిదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే బాట-దోరియా ప్రాంతంలో ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు మొదలైంది. డ్రోన్లు, స్నిఫర్ శునకాల ద్వారా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. అదే ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదుల్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాజౌరి, పూంచ్ బోర్డర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పూంచ్‌కు వెళ్లేవాళ్లు మెందార్ రూట్లో వెళ్లాలని సూచించారు. ఉగ్ర దాడిలో మృతిచెందిన జాబితాల్లో హవల్దార్ మణ్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్, దేబశిశ్ భస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్‌లు ఉన్నారు.