Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రంజాన్ మాసంలో చివరి శుక్రవారం, ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఈ తరుణంలో మక్కా మసీదు, సికింద్రాబాద్‌లోని జామ్-ఇ-మసీదులో ప్రార్థనల క్రమంలో ఈ ఆంక్షలుంటాయన్నారు. ఇవి ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయని తెలిపారు. చార్మినార్, మక్కామసీద్ వద్ద భద్రతను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షించనున్నారు. ప్రార్థనల దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.