Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 25 వరకూ అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ తరుణంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. దీంతో సోమవారం మరోసారి విచారణ చేపడతామని అన్ని విషయాలు అప్పుడు పరిశీలిస్తామని స్పష్టం చేసింది.