Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
తుళ్లూరు మండలం నెక్కల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నెక్కల్లు శివారులో రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రిని నిల్వ ఉంచారు. భారీ ఎత్తున ప్లాస్టిక్ పైపులు, మురుగు నీటి కాలువల కోసం తీసుకొచ్చిన పైపులను డంప్ చేశారు.
అయితే గత నాలుగేళ్లుగా అదే ప్రాంతంలో పైపులు ఉండటంతో వాటికి తేనెతెట్టలు పెరిగిపోయాయి. తేనె తీసుకునేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు పొగబెట్టడంతో మంటలు పైపులకు అంటుకున్నాయి. ఎండలు, గాలికి క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.