Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఇండియన్ ఆర్మీ సెల్ కొత్తగా ఎలక్ట్రిక్ జిప్సీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్‌పోల్ ఈవీ స్టార్టప్‌లతో కలిసి భారతీయ సైన్యం పాత జిప్సీ వాహనాలను కొత్త ఎలక్ట్రిక్ జిప్సీ వాహనాలుగ మార్చేస్తుంది. నిజంగానే ఈ వాహనాలు చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఎలక్ట్రిక్ అని ఆ వాహనాలపై కూడా రాశారు. రిట్రోఫిట్టింగ్ పేరుతో పాత జిప్సీలను కొత్తగా లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో ఎలక్ట్రిక్ జిప్సీలను ప్రదర్శనకు పెట్టారు. వాహనం చివరలో ఒకవైపు ప్యూర్ ఈవీ అని రాసి ఉంది. ఇక డోర్ వద్ద భారతీయ ఆర్మీకి చెందిన సింబల్ కూడా ఉంది.