Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్: సనత్‌నగర్‌కు చెందిన బట్టల వ్యాపారి వసీం ఖాన్ కుమారుడు అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం నమాజ్ చేయడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. మసీద్‌కు వెళ్లిన బాలుడు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అతని కోసం చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా బాలుడు కనిపించలేదు. దీంతో సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. స్థానిక మసీదు దగ్గరలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఫిజాఖాన్ అనే హిజ్రా వహీద్‌ను వెంటబెట్టుకుని వెళ్లడం రికార్డయ్యింది. ఇది చూసిన బాలుడి బంధువులు, స్థానికులు హిజ్రా ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు హిజ్రాను అరెస్టు చేశారు. హిజ్రాతో పాటు అతనికి సహాయపడ్డ మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. నరబలి కాదు చిట్టీల వ్యాపారంలో గొడవే హత్యకు కారణం అని పోలీసులు తెలిపారు.