Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్ అవుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా మహబూబాబాద్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు అయింది. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారయ్యారు. నిందితుల నుంచి రూ. 8లక్షల నగదు, 5 స్మార్ట్ ఫోన్లు, వాహనాలు, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. అంతే కాకుండా బెట్టింగ్ లకు పాల్పడితే కఠిణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.