Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరియు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మాటల యుద్ధం జరుగుతోంది. ఈటెల రేవంత్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ నుండి డబ్బులు తీసుకుని ఇలా చేస్తున్నావు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్న సమయంలోౌ ఇద్దరి మధ్య మాటల వార్ నడుస్తోంది. రేవంత్ మాట్లాడుతూ నేను ఏ పార్టీ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నేను నిరూపించుకుంటానుౌ రేపు సాయంత్రం భాగ్యలక్మి టెంపుల్ కు వస్తానని ఈటెల కూడా రావాలని సవాల్ చేశారు.. ఈటెల ముందే గర్భగుడి లో అమ్మవారి మీద ఒట్టేసి చెబుతాను ఎవరిదగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నాడు. నువ్వు గుడికి పిలిచినా తడి బట్టలతో వస్తాను అన్నాడు. ఈటెల వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటూ ఫైర్ అయ్యాడు. మునుగోడు ఎన్నికలో పెట్టిన ప్రతి రూపాయి ఆ నియోజకవర్గం బీసీ ఎస్సీ ఎస్టీ కులాల నాయకులే ఇచ్చారు, నేనే స్వయంగా పిలిచి డబ్బులు అడిగాను అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. నేను డబ్బులు అడిగిన సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు భట్టి విక్రమార్క లు కూడా ఉన్నారు అంటూ చెప్పారు. దేవుడు మీద ఈటెలకు నమ్మకం ఉంటే వచ్చి ఓట్టెయ్యాలి అంటూ రేవంత్ సవాలు విసిరాడు. మరి ఈ సవాలును ఈటెల స్వీకరిస్తారా ? ఈ వ్యాఖ్యలపై తాను ఈ విధంగా స్పందించనున్నాడు చూడాలి.