Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విదేశీ కరెన్సీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేంద్రం నుండి భారీ ఊరట లభించింది. విదేశీ దాతలు లేదా భక్తులు సమర్పించే కరెన్సీని డిపాజిట్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి టీటీడీకి మినహాయింపును ఇచ్చింది. వీటిని భక్తులు సమర్పించిన కానుకలుగా పేర్కొనాలని కేంద్రం సూచించింది. తద్వారా విదేశీ కరెన్సీ సమర్పించిన భక్తులు, దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి కేవలం టీటీడీకి మాత్రమే మినహాయింపును ఇచ్చింది. సెక్షన్ 50 ప్రకారం ఈ మినహాయింపు లభించింది. ఈ మేరకు టీటీడీ ఈవోకు సమాచారం ఇచ్చింది కేంద్రం.