Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 16వ సీజన్ 29వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. చెన్నై మూడు విజయాలతో జోరు మీద ఉంది. గత మ్యాచ్లో రాయల్ చాంలెంజర్స్ బెంగళూరును ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు.. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన మర్క్రం సేన విజయంపై కన్నేసింది. చెపాక్ స్టేడియంలో సొంత అభిమానుల సమక్షంలో చెలరేగాలని చెన్నై బ్యాటర్లు ఎదురుచూస్తున్నారు. సెంచరీ హీరో హ్యారీ బ్రూక్ నుంచి హైదరాబాద్ మళ్లీ కీలక ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇరుజట్లలో విజయం ఎవరిని వరిస్తుంది అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ కు దిగనుంది.