Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మార్చి 31న ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్ పోటీలు అత్యంత మనోరంజకంగా సాగుతున్నాయి. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. మొత్తం 70 మ్యాచ్ లతో కూడిన ఐపీఎల్ లీగ్ దశ మే 21న ముగియనుంది. మే 22 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ లకు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా... క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ లకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.
ప్లే ఆఫ్ షెడ్యూల్...
మే 23- క్వాలిఫయర్ 1 (చెన్నై)
మే 24- ఎలిమినేటర్ (చెన్నై)
మే 26- క్వాలిఫయర్ 2 (అహ్మదాబాద్)
మే 28- ఫైనల్ (అహ్మదాబాద్)