Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్లైన్లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మే 21వ తేదీన ఏఈఈ పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులతో పాటు సివిల్ పోస్టులకు కూడా ఆన్లైన్లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మే 21, 22వ తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. తుది స్కోరు ఖరారులో నార్మలైజేషన్ పద్ధతిని పాటించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.