Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్‌ను కూల్చారు. దాంతో, మరక్రం సేన 134 పరుగులకే పరిమితమైంది. మథీశ పథిరన వేసిన 20వ ఓవర్లో మార్కో జాన్సెన్(13) బౌండరీ బాదాడు. వాషింగ్టన్ సుందర్(8)ను ఆఖరి బంతికి ధోనీ రనౌట్ చేశాడు. దాంతో, 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, మథీశ పథిరన, ఆకాశ్ సింగ్, మహీశ్ థీక్షణ తలా ఒక వికెట్ తీశారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ(34), హ్యారీబ్రూక్(18) తక్కువకే పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి(21) రెండో వికెట్‌కు 36 రన్స్ జోడించారు. కెప్టెన్ ఏయిడెన్ మర్క్రం(12), మయాంక్ అగర్వాల్(2) విఫలమయ్యారు. ఆఖర్లలో హెన్రిచ్ క్లాసెన్(17), మార్కో జాన్సెన్(17) పోరాడడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ చేసింది.