Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ నెల 30న పీసీ, కమ్యూనికేషన్స్ పీసీ, జేఎల్ఎం, ఏఈ పరీక్షలు ఉన్నాయని.. నిరుద్యోగులు ఒకేరోజు 4 పరీక్షలు ఎలా రాస్తారని సీఎం కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని జేఎల్ఎం, ఏఈ పరీక్షలను ఒక వారమైనా వాయిదా వేయాలని శుక్రవారం ఆయన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నా.. మీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వనందునే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ అనే హ్యష్ ట్యాగ్‌ను ఆయన ట్వీట్‌కు జత చేశారు.