Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్య రెట్టింపు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రైలు 8 కోచ్‌లతో నడుస్తోంది. ప్రయాణికుల నుంచి డిమాండ్ బాగా ఉన్న నేపథ్యంలో బోగీల సంఖ్యను 16కు పెంచే కసరత్తు మొదలైంది. ఈ మేరకు రైల్వేబోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సంకేతాలు అందాయి. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రస్తుతం 120-130 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. చాలామంది రిజర్వేషన్ దొరక్క ఈ రైల్లో ప్రయాణం చేయలేకపోతున్నారు.