Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తమిళనాడు : వారంలోని మొత్తం సమయంలో మార్పులేకుండా ప్రైయివేటు సంస్థలు, పరిశ్రమల్లో రోజు 12 గంటలపాటు పనిచేసేలా ఓ బిల్లు తమిళనాడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు సహా అధికార కూటమి పార్టీల సభ్యుల వ్యతిరేకత మధ్య మూజువాణి విధానంలో బిల్లు నెరవేరింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం శాసనసభలో కార్మిక సంక్షేమశాఖ మంత్రి సీవీ గణేశన్ ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రైయివేటు సంస్థలు, పరిశ్రమల్లో వారంలోని మొత్తం పనివేళల్లో మార్పులేకుండా రోజుకు 12 గంటలుగా పనివేళలను పెంచే ఆ బిల్లుకు ప్రతిపక్షాలు, డీఎంకే కూటమి పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతలు విలేకర్లతో మాట్లాడారు. ఇది పరిశ్రమల యాజమాన్యానికి అనుకూలమైన బిల్లుగా ఉందని సిందనై సెల్వన్ (వీసీకే) ఆరోపించారు. ఇది శ్రమదోపిడీకి బాటలు వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రాష్ట్రప్రభుత్వం ఈ బిల్లు నెరవేర్చిందని నాగై మాలి (సీపీఐ(ఎం)) ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాసే ఈ చట్టం గురించి ఉదయాన్నే ముఖ్యమంత్రితో మాట్లాడగా ఆయన హామీ ఇచ్చారని, అయినా బిల్లును నెరవేర్చారని విమర్శించారు. వందేళ్లు పోరాడి సాధించిన వేతనపెంపు, ఉద్యోగ పర్మినెంట్ వంటివాటిని నీరుగార్చేలా ఈ బిల్లును ప్రవేశపెట్టారని రామచంద్రన్ (సీపీఐ) ఆరోపించారు. శాసనసభ ప్రాంగణంలో పరిశ్రమలశాఖ మంత్రి తంగం తెన్నరసు విలేకర్లతో మాట్లాడారు. నేటి ప్రపంచవ్యాప్త పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు తమిళనాడుకు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి తరలివచ్చే పలు పరిశ్రమలు పనివేళల్లో వెలుసుబాట్లు కోరుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిశ్రమల కోసమే ఈ చట్టమని తెలిపారు. ఈ బిల్లు ఏ కార్మికులకు వర్తిస్తుందనే విధానాలను ప్రభుత్వం రూపొందించి వెల్లడిస్తుందని పేర్కొన్నారు. ఈ విధానానికి సుముఖంగా ఉండేవారు మాత్రమే పాటించే హక్కు కల్పించనున్నట్టు తెలిపారు. 12 గంటల పనికి తగిన వసతులను కార్మికులకు కల్పించేలా ఉండే సంస్థలు, పరిశ్రమలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. కార్మిక సంక్షేమశాఖ మంత్రి సీవీ గణేశన్ మాట్లాడుతూ... ఈ బిల్లు వల్ల వారంలోని మొత్తం పనివేళల్లో మార్పు ఉండదన్నారు. బిల్లు ప్రకారం 4 రోజులు పనిచేసి మిగతా 3 రోజులు విశ్రాంతి తీసుకోవచ్చని తెలిపారు.