Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రిటన్‌లోని ఓ మేజర్ హైవేపై ప్రమాదం జరిగింది. కారు, ఇంధన ట్యాంకర్ ఢీకొన్నాయి. థేమ్స్ నదిపై ఉన్న ఓ బ్రిడ్జ్‌పై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. న్యూ లండన్, గ్రోటన్ మధ్య ఉన్న థేమ్స్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. ఫ్యూయల్ ట్యాంకును కారు ఢీకొనడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా కమ్ముకున్నది.