Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. శనివారం తెల్లవారుజామున బాలాఘాట్లోని కాడ్లా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మరణించిన మావోయిస్టులను ఏరియా కమిటీ మెంబర్ , భోరందేవ్ కమిటీ కమాండర్ అయిన సునీత, ఏరియా కమిటీ మెంబర్ సరితా ఖాటియా మోచాగా గుర్తించారు. ఇద్దరి తలలపై రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉన్నదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో తుపాకులు, కాట్రిజ్‌లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.
కాగా, బాలాఘాట్‌లో గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టులు క్రియాశీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ పోలీసుకు శాంతి భద్రతలను కాపాడటం సమస్యగా మారింది. దీంతో నక్సలైట్ల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో గతేడాది ఆరును మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు.