Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగుళూరు
మే 10వ తేదీన జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు ఉగ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు.
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్‌లోనూ ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రచారం కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలికి చేరుకున్న తర్వాత హెలిప్యాడ్‌లోనే శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్‌ను చెక్ చేశారు. ఆ చాపర్‌లో తమ పార్టీ చీఫ్ ప్రయాణించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సోదాలు చేయడంలో తప్పులేదని, వాళ్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు డీకే శివకుమార్ తెలిపారు.