Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రంజాన్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. హోం మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో హోంమంత్రి కుటుంబ సభ్యులకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు.