Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో
ఐపీఎల్ సీజన్-16లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 30వ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తరఫున నూర్ అహ్మద్ అరంగేట్రం చేస్తున్నాడు. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తం ఐదు మ్యాచ్లు ఆడి మూడు విజయాలు నమోదు చేసుకుంది.