Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో స్పష్టత వచ్చింది. ప్రీతిది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా 306గా ఈ కేసును నిర్ధారించామని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వరంగల్ సీపీనీ కలిసిన మెడికో ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ కలిశారు. మెడికో ప్రీతి ఆత్మహత్యగా పోలీసులు ప్రకటించడంతో సీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో ప్రీతి తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడుతూ సీపీతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని, ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామన్నారు. సిరంజి దొరికిందని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందని సీపీ చెప్పారని కానీ రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామని ఛార్జ్షీట్లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్ఓడీల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటున్నామని ప్రీతి తండ్రి నరేందర్ అనుమానం వ్యక్తం చేశారు.