Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కూలర్లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్ తో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. కూలర్లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మనోజ్ అరుణచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో కూలర్‌ను వాడుతున్నారు. ఐటీబీపీ జవాన్ మనోజ్ మరణంతో శ్రీరామ్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.