Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పలువురు సీఐలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐదుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీ మన్మోహన్(సీఐ) సీసీఎస్ ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి డీపీవో పీసీఆర్‌కు బదిలీ చేశారు. సీఐలు వీ స్వామి, పీ వెంకటేశ్వర్లు, పీ గుర్వా రెడ్డిలను స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. సీఐ బీ ప్రవీణ్ కుమార్‌ను కుషాయిగూడ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు. ఎస్ఐ ఎం విక్రమ్ రెడ్డిని పోచంపల్లి పోలీసు స్టేషన్‌కు, ఎస్ఐ వీ సైదిరెడ్డిని ఎల్బీనగర్ సీసీఎస్‌కు, ఎస్ఐ డీ అశోక్‌ను ఘట్కేసర్ పీఎస్‌కు బదిలీ చేశారు.