Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నవతెలంగాణ
గుజరాత్ టైటాన్స్ జట్టు తన ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ బ్యాటింగ్కు అంతగా అనుకూలించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ముందు 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బ్యాటర్లతో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (47), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (66) మాత్రమే రాణించారు.
మిగతా బ్యాటర్లలో విజయ్ శంకర్ (10) స్కోరు చేశాడు. గిల్ పరుగుల ఖాతా తెరుకుండానే ఔటయ్యాడు. అభినవ్ మనోహర్ (3), డేవిడ్ మిల్లర్ (6), రాహుల్ తెవాటియా (2) పూర్తిగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ చెరో రెండు వికెట్లు, అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ కి దిగింది. ఈ క్రమంలో మేయర్స్ (14).కె.ఎల్ రాహుల్(16) తో నాలుగు ఓవర్లలో 30 పరుగులతో కొనసాగుతుది.