Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
కేఏ పాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నంలో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన కె ఏ పాల్ అక్కడినించి తిరిగి వెళుతూ మార్గమధ్యంలో మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత నా ఒక్కడికే ఉందని, ఏడాది కాలంగా కమిటీలను లెటర్ ఇమ్మని అడుగుతున్నా అన్నారు. చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ పరిపాలనలో ఫెయిలయ్యారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అమరావతి పూర్తి చేస్తా అన్నారు. నేను ఈ ప్రాంతంలో పుట్టి అభివృద్ధి చేసిన వాడిని అని పలు విషయాలపై స్పందించారు.