Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం
ఐస్క్రీమ్లో విషం కలిపి 12 ఏళ్ల బాలుడ్ని అతడి మేనత్త చంపింది. దర్యాప్తులో ఈ విషయం బయటపడటంతో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 16న అరికులంలో నివసించే ఒక మహిళ తన మేనల్లుడైన 12 ఏళ్ల అహ్మద్ హసన్ రిఫాయికి విషం కలిపిన ఐస్క్రీమ్ ఇచ్చింది. అది తిన్న ఆ బాలుడు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ మరునాడు చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాలుడు అహ్మద్ హసన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.