Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చేవెళ్ల
దివంగత మాజీ మంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా చేవెళ్ల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ తరుణంలో ఇంద్రారెడ్డి విగ్రహానికి కుమారులు కార్తీక్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, డీసీఎం ఎస్ చైర్మన్ పట్లోళ కృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పేదల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంద్రన్న కల అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి కృష్ణా రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్ రాజ్, వైస్ ఎంపీపీ ప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేష్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.