Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో కాలేజీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయగా నేషనల్ మెడికల్ కమిషన్ శనివారం అనుమతి ఇచ్చింది. కళాశాలలో వంద ఎంబీబీఎస్ సీట్ల అనుమతులు జారీ చేసింది. దాంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడ్డట్లయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కాలేజీతో కలిపి మొత్తం ఏడు కాలేజీలకు అనుమతి వచ్చింది. మరో రెండు కాలేజీలకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది.