Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పంజాబ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్టయ్యాడు. పంజాబ్‌లోని మోగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అతడికి సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది.
అమృత్‌పాల్ పరారైనప్పటి నుంచి అతడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల కోసం పంజాబ్ ప్రభుత్వం పోలీసులకు సెలవులనూ రద్దు చేసింది. ఎట్టకేలకు నేడు అతడిని మోగా పోలీసులు అరెస్ట్ చేశారు.