Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని బొంతుపల్లి, ఎల్బాక, గంగారం, మామిడాలపల్లి గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి శనివారం ప్రాంరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చే సిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు చదువు లక్ష్మి, చదువు స్వరూప, మూల రజిత, బండ సుజాత, పింగిలి కొమాల్ రెడ్డి, కాంతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాడ సాధవరెడ్డి, చదువు నర్సింహరెడ్డి, మూల పుల్లారెడ్డి, బండ కిషన్ రెడ్డి పీఏసీఎస్ డైరెక్టర్లు చెకబండి శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి మధుసూదన్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.