Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
- ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ
నవతెలంగాణ-వీణవంక
రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండలంలోని వీణవంక, వల్బాపూర్ గ్రామాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. రైతుందరూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు రైతులను ఇబ్బంది పెట్టకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని, తరుగు పేరిట కోతలు పెట్టొద్దని ఆదేశించారు. ధాన్యం దిగుమతి సమయంలో కటింగ్ పేరిట కోతలు విధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బస్తాకు 41 కిలోల ధాన్యం మాత్రమే తూకం వేయాలని, గతంలో మాదిరిగా ఎక్కువగా తూకం వేస్తే మిల్లులను సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి, బీఆర్ఎస్ నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాడ సాధవరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు గూటం సమ్మిరెడ్డి, రాములు, చెకబండి శ్రీనివాస్ రెడ్డి, కామిడి శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.