Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కోడిగుడ్లు అరువివ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో ఓ బిర్యానీ సెంటర్ యజమానిని కొందరు యువకులు కిడ్నాప్ చేసి దాడి చేశారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బిలాస్పూర్ జిల్లా బర్తోరి గ్రామానికి చెందిన యోగేశ్ వర్మ బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. కోహ్రాడా గ్రామానికి చెందిన దీపక్ చతుర్వేది, రాహుల్ కుమార్ భాస్కర్, పరమేశ్వర్ భరద్వాజ్ ఈ నెల 20న అతడి బిర్యానీ సెంటర్‌కు వచ్చారు. కోడిగుడ్లు అప్పుగా ఇవ్వమని అడగ్గా అందుకు యోగేశ్ నిరాకరించాడు. దీనిని అవమానంగా భావించిన యువకులు అదే రోజు సాయంత్రం 5.30గంటల సమయంలో అతడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కారులో ముక్తిధామ్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అతడిని తిడుతూ దాడిచేశారు. ఈ కిడ్నాప్‌పై సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని యోగేశ్ వర్మను విడిపించారు.