Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 10,112 కేసులు నమోదయ్యాయి. మరో 9,833 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. నిన్న దేశంలో 12,193 కరోనా కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
ఇక శనివారం కరోనాతో 29 మంది మరణించారు. ఒక్క కేరళలోనే ఏడుగురు కన్నుమూశారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,329కు చేరుకుంది. కరోనా వ్యాప్తి తీవ్రతను సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.43 శాతంగా ఉందని పేర్కొంది. కొవిడ్ రికవరీ రేటు 98.66 శాతమని వెల్లడించింది.