Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చలాకీ చంటిగా జబర్దస్త్ కామెడీ షోలో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన కమెడియన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. గుండెనొప్పితో బాధపడుతున్న చంటిని శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చంటిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చంటి అనారోగ్యంపై అధికారిక సమాచారం లేదు. ఆస్పపత్రి వర్గాలు కానీ, ఇటు చంటి సన్నిహితులు కానీ మీడియాకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరకు పరిచయమైన చలాకీ చంటి పలు సినిమాల్లోనూ నటించారు. సినిమా షూటింగ్ ల కోసం జబర్దస్త్ షో ను విడిచిపెట్టారు. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్నా.. చివరి వరకూ పోటీలో ఉండలేక మధ్యలోనే బయటికి వచ్చేశారు. కొంతకాలంగా ఇటు బుల్లితెరపై కానీ అటు వెండితెరపై కానీ చంటి కనిపించడంలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం చంటి అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి.