Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ: చైనారక్షణ మంత్రి లీషాంగ్‌ఫూ, రష్యా డిఫెన్స్ మినిస్టర్ సెర్గీ షోయగులు భారత్‌లో పర్యటించనున్నారు. వీరు వచ్చే వారం న్యూఢీల్లీలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్‌లో పాల్గొనున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాలు ధ్రువీకరించాయి. ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశం ఏప్రిల్ 27, 28 తేదీల్లో భారత్‌లో జరగనుంది. ఈ సమావేశానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, ఆఫ్గానిస్థాన్‌లోని భద్రతా పరిస్థితి వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్‌ను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించారు. కానీ, ఇప్పటి వరకు పాక్ మంత్రి హాజరుపై ఎటువంటి ధ్రువీకరణ రాలేదు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రక్షణ మంత్రి భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి.