Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 32వ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్లు ఆడి నాలుగింట విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆరు మ్యాచ్లు ఆడి.. మూడు విజయాలు, మూడు పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో ఆరో స్థానంలో ఉన్నది.