Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజమండ్రి
ఓ ఇంటర్ విద్యార్ధి కారు బీభత్సం సృష్టించాడు. రాజమండ్రి రూరల్ కాతేరు వద్ద విద్యార్థి డ్రైవింగ్ చేస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్ళింది. రోడ్డుపై ఒక్కసారిగా కారు వేగంగా దూసుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. కాతేరు లోని ఓ కార్పొరేట్ కాలేజ్ లో ఇటీవలే విద్యార్థి ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశాడు. ఇవాళ విట్ కళాశాల ఎగ్జామ్ రాసేందుకు కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అకస్మాత్తుగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.