Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డెహ్రాడూన్: హెలికాప్టర్ వద్ద సెల్ఫీ దిగేందుకు ప్రభుత్వ అధికారి ప్రయత్నించారు. అయితే దాని వెనుక ఉన్న రెక్కలు తగలడంతో ఆయన మరణించారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఈ సంఘటన జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ఫైనాన్షియల్ కంట్రోలర్ జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్నాథ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ముందు సెల్ఫీ తీసుకునేందుకు ఆయన ప్రయత్నించారు. హెలికాప్టర్ వెనుక తిరుగుతున్న రెక్కల సమీపానికి ఆయన వెళ్లారు. ఈ క్రమంలో ఆ రెక్కలు ప్రభుత్వ అధికారి తలకు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.