Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
బెజవాడ పోలీసులు తొలిసారి ఓ మహిళను నగర బహిష్కరణ శిక్ష వేశారు. సారమ్మపై అజిత్సింగ్ నగర్ పీఎస్లో 13 కేసులున్నాయి. గంజాయి అమ్మడం మొదలు చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది. ఈమెపై పోలీసులు నిఘా పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఆమెలో మార్పు రాలేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు పెట్టినా తీరు మారకపోవడంతో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు.
ఈ తరుణంలో కఠిన శిక్షకు సిద్ధం అయ్యారు. సారమ్మ అలియాస్ శారదకు చివరికి నగర బహిష్కరణే మార్గమని భావించిన పోలీసులు అదే నిర్ణయాన్ని అమలు చేశారు. ఈమెతోపాటు 19 మందిని సిటీ నుంచి బహిష్కరించారు. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ఈ నగర బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు. మరోసారి వీళ్లు గంజాయి కేసుల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ క్రాంతి రాణా టాటా వార్నింగ్ ఇచ్చారు.