Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మన దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో ప్రారంభించబోతున్నారు. వాటర్ మెట్రో అనేది ప్రత్యేకమైన పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ. సంప్రదాయ మెట్రో వ్యవస్థలో మాదిరిగానే ఈ రవాణా వ్యవస్థలో కూడా ప్రయాణించవచ్చు. కొచ్చి వంటి నగరాల్లో ఇది ఉపయోగకరం. అయితే రూ.1,136.83 కోట్ల వ్యయంతో కొచ్చిలో ఈ మెట్రో వ్యవస్థను నిర్మించారు. కొచ్చి పరిసర ప్రాంతాల్లోని 10 దీవులను అనుసంధానం చేశారు.
ఈ ప్రాజెక్టు వల్ల కొచ్చి నగర అభివృద్ధి వేగవంతమవుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వాటర్ మెట్రో ప్రాజెక్టు తొలి దశలో హైకోర్టు-విపిన్ టెర్మినల్స్ నుంచి వైట్టిల-కక్కనడ్ టెర్మినల్స్ వరకు సేవలు ప్రారంభమవుతాయి. ఈ మెట్రో సేవలు సురక్షితమని, చౌక కూడానని పినరయి విజయన్ తెలిపారు. ఎయిర్ కండిషన్డ్ బోట్లలో ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవలసిన అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చునన్నారు.