Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచికొట్టారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్వెల్(77) అర్థ శతకంతో చెలరేగారు. ఈ తరుణంలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్వెల్ వేగంగా ఆడారు. 11 ఓవర్లకు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన వీళ్లిద్దరు వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది. చివర్లో దినేశ్ కార్తిక్(16), మహిపాల్ లొమ్రోర్(8), వనిందు హసరంగ(6) ధాటిగా ఆడడంతో 180 ప్లస్ చేయగలిగింది.