Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు 33వ మలుపు వద్ద ఆరుగురితో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని బోల్తాపడింది. ఘాట్‌రోడ్డు పక్కన లోతు తక్కువగా ఉండటంతో వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర ప్రయాణికులు ఘాట్‌రోడ్డు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను కారు నుంచి బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్శనమయ్యాక తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.