Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: ఏపీలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఆదివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో పిడుగులు పడి ఇద్దరు రైతులు మృతి చెందారు. కల్లంలో ఉన్న మిర్చిపై పట్టలు కప్పుతుండగా పిడుగు పడింది. దీంతో రైతు శ్యామ్‌బాబు అక్కడికక్కడే చనిపోగా , తీవ్రంగా గాయపడ్డ కృపాదానం అనే రైతును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో వారి రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కాగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని సూచించారు. వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలియజేసింది. ఉభయ గోదావరి జిల్లాలోని పాగు కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.