Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లాలో శనివారం వడగళ్ల వానతో పంటలు దెబ్బతినగా ఆదివారం మంత్రి క్షేత్రస్థాయి పంటలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పంట నష్టానికి సంబంధించి విషయాలపై ఆరా తీశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కొద్ది రోజుల కిందట ప్రకృతి బీభత్సానికి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఆయా చోట్ల పర్యటించి, రైతుల పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు భరోసా కల్పించారన్నారు. పరిహారంపై గతంలో ఎక్కడా ఎన్నడూ ఇవ్వనంత ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ నష్టాన్ని రైతులు మరిచిపోక ముందే మరోసారి వడగళ్ల, అకాల వర్షాలు కురవడం దురదృష్టకమన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.